Meera Jasmine : సీనియర్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ.. ఒక్కరోజులోనే లక్షకు పైగా ఫాలోవర్స్..

‘అమ్మాయి బాగుంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్‌ ఆ తర్వాత 'గుడుంబా శంకర్', 'భద్ర', 'పందెం కోడి', 'గోరింటాకు' లాంటి సినిమాలతో తెలుగులో.........

Meera Jasmine : సీనియర్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ.. ఒక్కరోజులోనే లక్షకు పైగా ఫాలోవర్స్..

Meera Jasmine

Updated On : January 21, 2022 / 7:26 AM IST

Meera Jasmine :  ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్‌ ఆ తర్వాత ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెం కోడి’, ‘గోరింటాకు’ లాంటి సినిమాలతో తెలుగులో పాపులర్ అయింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించినా మలయాళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ వెళ్ళింది. దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసింది.

అయితే మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయింది మీరా జాస్మిన్‌. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అయింది. ఇటీవలే మలయాళంలో ఒక సినిమాని అనౌన్స్ చేసి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లోనూ ఆఫర్స్ వస్తే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అని చెప్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

Supritha : సురేఖవాణి కూతురు బాయ్‌ఫ్రెండ్‌ని ఇతనే..

మీరా జాస్మిన్ నిన్న అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ని క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజుకే లక్షా నలభై వేలకుపైగా ఫాలోవర్స్ ఆమెను ఫాలో అయ్యారు. సినిమాలకి దూరం అయినా మీరా జాస్మిన్ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు అని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత హాట్ ఫొటోషూట్ కూడా చేసింది మీరా. మరి మన తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Meera Jasmine (@meerajasmine)