చిరంజీవి బర్త్ డే…100 మంది సెలబ్రెటీల మోషన్ పోస్టర్

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 10:37 AM IST
చిరంజీవి బర్త్ డే…100 మంది సెలబ్రెటీల మోషన్ పోస్టర్

Updated On : August 21, 2020 / 12:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్టు 22. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..కొత్తగా ప్లాన్ వేశారు.



భారతదేశ చరిత్రలో మునుపెన్నరూ చేయని విధంగా…తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెష్ ఇవ్వబోతున్నారు. చిరంజీవి  పుట్టిన రోజు సందర్భంగా 100 మంది ఇండియన్ టాప్ సెలబ్రిటీలతో మెగా కామన్ పోస్టర్ ను లాంచ్ చేయనున్నారు.

ఆగస్టు 21వ తేదీ..సాయంత్రం 7 గంటలకు ఈ లాంచ్ ఉండనుంది. ఈ మేరకు బీఏ రాజు…ట్విట్టర్ వేదికా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి పోస్టర్ ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సాయంత్రం 7 ఎప్పుడెతుందా ? అని ఎదురు చూస్తున్నారు.



మరోవైపు…డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. . శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

అభిమానులకు పుట్టిన‌రోజు గిప్ట్‌ను చిరంజీవి అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 22 సాయంత్రం 04 గంట‌ల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.