Mega Family Chiranjeevi Ram Charan sankranti celebrations videos and photos gone viral
Mega Family : మెగా ఫ్యామిలీ ప్రతి పండుగని కుటుంబమంతా కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతి పండుగని కూడా అలాగే అందరూ కలిసి జరుపుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సంక్రాంతికి కొత్త మనవరాలు, కొత్త కోడలు మెగా ఇంట అడుగు పెట్టారు. దీంతో మెగా ఫ్యామిలీ కొత్త మహాలక్ష్మిలతో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇక ఈ సెలబ్రేషన్స్ కి బెంగళూరు ఫార్మ్ హౌస్ విడిది అయ్యింది. ఆల్రెడీ అక్కడికి చేరుకున్న మెగా ఫ్యామిలీ అక్కడ పండగని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెడుతూ ఆడియన్స్ కి తెలియజేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : HanuMan : తీసినోడు నా కొడుకు.. పుత్రోత్సాహంతో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి..
ఈ పోస్టుల్లో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కుమార్తె అర్హ, చిరు సతీమణి సురేఖ తదితరులు కనిపిస్తున్నారు. ఇక ఇదే వీడియోలో కొత్త కోడలు లావణ్య సున్నుండలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక నిన్న జనవరి 13న పంజా వైష్ణవ తేజ్ పుట్టినరోజు కావడంతో అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా నిర్వహించారు. మరి మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
కాగా చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు.. జనవరి 22న ఘనంగా జరుగుతున్న అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ కి అతిథులుగా వెళ్ళబోతున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశంలోని పలు రంగాలలో ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. అన్ని భాషల సినీ రంగంలో కూడా చాలా మందికి ఆహ్వానాలు అందాయి. ఈక్రమంలోనే టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్‌కి ఆహ్వానాలు అందాయి.