HanuMan : తీసినోడు నా కొడుకు.. పుత్రోత్సాహంతో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి..

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి పుత్రోత్సాహం చూశారా. తీసినోడు నా కొడుకు అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

HanuMan : తీసినోడు నా కొడుకు.. పుత్రోత్సాహంతో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి..

HanuMan director Prashanth Varma father proud moment video gone viral

Updated On : January 14, 2024 / 7:43 AM IST

HanuMan : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ‘అ’ సినిమాతో మొదలైన ప్రశాంత్ వర్మ జర్నీ.. కల్కి, జాంబి రెడ్డి సినిమాల సక్సెస్ తో ముందుకు సాగింది. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. నేడు జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా మూవీలోని VFX క్వాలిటీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ చూపించిన గ్రాఫిక్స్ అందర్నీ ఆశ్చర్యపరిచాయి. దీంతో ఇండియా వైడ్ ప్రశాంత్ వర్మ పేరు మారుమోగుతోంది. ఇక మరోసారి తెలుగు దర్శకుడు పేరు దేశమంతటా గొప్పగా వినిపిస్తుండడంతో తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషతో సంబంధం ఉన్నవారే అంతలా సంతోష పడుతుంటే, మరి ప్రశాంత్ వర్మతో తండ్రి సంబంధం ఉన్న వ్యక్తి ఇంకెంత సంతోష పడతారు.

Also read : Naa Saami Ranga Twitter Review : నాగార్జున ‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. థియేటర్ లో సినిమా చూసి వస్తున్న ఓ వ్యక్తిని మీడియా వారు ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియక సినిమా ఎలా ఉందని రివ్యూ అడిగారు. ఆ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘తీసినోడు నా కొడుకు’ అంటూ పుత్రోత్సాహంతో చెప్పుకున్నారు. ఆయన మొహంలో ఆనందం అందరికి సంతోషం ఇస్తుంది.

దీంతో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేస్తూ.. ప్రశాంత్ వర్మని ట్యాగ్ చేస్తున్నారు. మీ నాన్నని గర్వపడేలా చేశావు. నీ గోల్ నువ్వు సాదించావు బ్రో అంటూ పోస్టులు వేస్తున్నారు. కాగా ప్రశాంత్ వర్మ గత నాలుగు రోజులు నుంచి తీవ్ర జర్వంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ సినిమా కోసం ప్రమోషన్స్ అంటూ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు సక్సెస్ టాక్ రావడంతో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు.