Mega Power Star Ram Charan meets Nara Brahmani at Taking Oath Ceremony Video goes Viral
Ram Charan – Brahmani : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మిగిలిన మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేసారు. సినీ ప్రముఖులు, వారి కుటుంబాలు, రాజకీయ నాయకులు.. ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి రావడంతో ఎన్నో ఆసక్తికర సంఘటనలు నెలకొన్నాయి.
Also Read : Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ అటు ప్రమాణ స్వీకారం.. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ రిలీజ్..
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుండగా వీక్షకుల గ్యాలరీలో నారా బ్రాహ్మణి, రామ్ చరణ్ ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నారు. చరణ్, బ్రాహ్మణి సరదాగా మాట్లాడుకుంటున్నారు. దీంతో చరణ్, బ్రాహ్మణి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.