Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ అటు ప్రమాణ స్వీకారం.. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ రిలీజ్..

పదేళ్ల కల నెరవేరుతున్నందుకు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పవన్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ మరో గిఫ్ట్ ఇచ్చింది.

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ అటు ప్రమాణ స్వీకారం.. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ రిలీజ్..

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie New Poster Released on his Oath Ceremony Day

Updated On : June 12, 2024 / 2:29 PM IST

Ustaad Bhagat Singh : నేడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషంలో ఉన్నారు. పదేళ్ల కల నెరవేరుతున్నందుకు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పవన్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ మరో గిఫ్ట్ ఇచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే పవన్ రాజకీయ బిజీ వల్ల ఈ సినిమా షూటింగ్ పక్కన పెట్టారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి.

Also Read : Mega Moment : ఇవాళ మెగా ఫ్యాన్స్‌కి పండగే.. చిరు, పవన్‌ని దగ్గరకు తీసుకున్న మోదీ.. నేషనల్ లెవల్‌లో మెగా క్రేజ్..

తాజాగా నేడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా నడిచి వస్తున్నాడు. పోస్టర్ పై సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని రాసి ఉంది. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు మూవీ యూనిట్. దీంతో ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.