Chiranjeevi: చిరంజీవి తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఏంటి?
కొన్ని ప్రాంతాల్లో వారం, రెండు వారాల ముందు నుంచి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు.

మెగాస్టార్ బర్త్‌డే అంటే అభిమానులకు పండగే పండగ… ఉభయ రాష్ట్రాల్లో చిరంజీవి పుట్టనరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుంటారు ఫ్యాన్స్. మెగాస్టార్ కూడా ఫ్యాన్స్‌తో కలిసి ఆ సంబరాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఐతే ఈ సారి తన పుట్టినరోజు విషయమై ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట మెగాస్టార్. ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను కలిగిస్తూ చిరంజీవి తీసుకున్న ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం…
ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. 69వ ఏటలోకి ప్రవేశిస్తున్న మెగాస్టార్ ఈ సారి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. మెగా బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చారు. వయనాడ్ విలయంతో చలించిపోయిన చిరంజీవి ఈ సారి తన పుట్టినరోజున ఎలాంటి హంగామా చేయొద్దని అభిమానులకు సూచించారట. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు చెబుతున్నారు. ఏటా చిరంజీవి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్.
కొన్ని ప్రాంతాల్లో వారం, రెండు వారాల ముందు నుంచి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఐతే వాయనాడ్ విపత్తు కారణంగా ఈ సారి గ్రాండ్ సెలబ్రేషన్లు వద్దని అభిమానులను కోరారట చిరంజీవి. వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకోడానికి కేరళ వెళ్లి, కోటి ఆర్థిక సాయం చేసిన మెగాస్టార్…. అక్కడి బాధితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయినట్లు చెబుతున్నారు. దీంతో సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సంబరాలు చేసుకోవడం సబబు కాదని నిర్ణయించుకున్నారట చిరంజీవి.
ఐతే గ్రాండ్ సెలబ్రేషన్లు వద్దన్న చిరంజీవి… రక్తదాన శిబిరాలను అన్నదాన కార్యక్రమాలు చేయాలని సూచించారట. సేవా కార్యక్రమాలను కొనసాగించాలని… హడావుడి మాత్రం చేయొద్దని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏటా చిరంజీవి పుట్టినరోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఫ్యాన్స్. మొత్తానికి అభిమాన హీరో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను సింపుల్‌గా చేయాల్సిరావడం ఫ్యాన్స్‌ని నిరుత్సాహానికి గురిచేసినా, సేవా కార్యక్రమాలతో మెగాస్టార్‌కు మరింత పేరు వచ్చేలా చేస్తామంటున్నారు ఫ్యాన్స్.
Also Read: ‘ఆహా’లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ‘కాళరాత్రి’ స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..