Kalarathri : ‘ఆహా’లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ‘కాళరాత్రి’ స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..
ఇప్పుడు మరో డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆహా ఓటీటీలోకి రాబోతుంది.

Suspense Thriller Movie Kalarathri Streaming in Aha OTT Full Details Here
Kalarathri : ఆహాలో ఇటీవల కొత్త కొత్త సినిమాలు, షోలు రెగ్యులర్ గా తెస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ వారం వారం కొత్త సినిమాలు తీసుకొస్తుంది ఆహా ఓటీటీ. ఇప్పుడు మరో డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆహా ఓటీటీలోకి రాబోతుంది.
మలయాళంలో హిట్ అయిన ‘నల్ల నిలువుల్ల రాత్రి’ సినిమాని తెలుగులో కాళరాత్రి పేరిట రిలీజ్ చేస్తున్నారు. బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి.. పలువురు ముఖ్య పాత్రల్లో మర్ఫీ దేవసి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మాణంలో కాళరాత్రి పేరిట రిలీజ్ కాబోతుంది.
Also Read : Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. ‘భైర’ పాత్ర అదిరిందిగా..
ఈ కాళరాత్రి సినిమా ఆగస్టు 17వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సరదాగా కొంతమంది ఫ్రెండ్స్ ఓ టూర్ వేస్తే రాత్రి పూట దారిలో వారు ఎదుర్కున్న అనుభవాలు ఏంటి అనే సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా మెప్పిస్తుంది. ఆహా ఓటీటీలో ఈ కాళరాత్రి సినిమా చూసేయండి.
సరదాగా మొదలైన ఫ్రెండ్స్ టూర్..
కాళరాత్రిగా ఎలా మారింది??Watch #Kalarathri from tomorrow only on aha ?#KalarathrionAha #aha pic.twitter.com/S57fO0PyrR
— ahavideoin (@ahavideoIN) August 16, 2024