మహేశ్ కత్తిలా ఉన్నాడు.. విజయశాంతి అలానే ఉంది

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లాల్ బహదూర్ స్టేడియంలో ఫుల్ జోష్ తో జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి.. అభిమానులతో మొదలుపెట్టి విజయశాంతితో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ..
* అభిమానులకు థ్యాంక్స్. లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు తెచ్చుకున్న హీరోగా ఎదిగిన విజయశాంతి గారికి.. మహేశ్ బాబులో చెరగని చిరునవ్వుతో పాటు చిలిపితనం కూడా ఉంటుంది. హీరోయిన్ రష్మిక, తమన్నాకు సంగీతకు ఇతర నటీనటులుందరికీ.. ఈ సినిమా చక్కదిద్దిన అనిల్‌కు, నిర్మాత అనిల్ సుంకరకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
* కొద్ది రోజుల క్రితం పేపర్ లో మహేశ్ బాబు ఫొటో చూశా. కత్తిలా ఉంది. మహేశ్ బాబు చాలా స్మార్ట్ గా ఉన్నావని ఫోన్ చేశా. అంతలోనే సినిమా అయిపోయిందని ఫోన్ వచ్చింది మీరు చీఫ్ గెస్ట్ గా రావాలని కోరారు. ఇంత త్వరగా సినిమా అయిపోయిందేంటా అనుకున్నా.
* సినిమా పూర్తయ్యేంత వరకూ రూపాయి కూడా తీసుకోలేదు. ప్రొడ్యూసర్ కు సపోర్ట్ గా నిలబడుతున్నాడు. అనిల్ సుంకరకు ఇది కూడా లాభమే. తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడం చాలా మంచి పని. నేను కూడా 99రోజులు పూర్తవకుండానే సినిమాలు చేస్తా.
* సౌతిండియాలోనే సీనియర్ నటుడు కృష్ణ గారు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు రావాలని కోరుకుంటున్నాను. 350సినిమాలకు మించి చేశారు. ధైర్యమున్న వ్యక్తి.
* మహేశ్ బాబు తండ్రి కృష్ణ అనే స్థాయికి ఎదుగుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా శ్రమించాడు. డైరక్టర్ అనిల్ కామెడీ యాంగిల్ లో కూడా బాగా చేశారనే అనుకుంటున్నాను. నైజాం కింగ్ దిల్ రాజు చేయి పడిందంటే సినిమా హిట్ అంతే.
* తమన్నా.. రష్మికలు బాగా చేశారు. సంగీత మంచి డ్యాన్సర్. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
* నాతో ఉండాల్సిన విజయశాంతి కాదని వెళ్లిపోయింది. విజయశాంతి నీ మీద నాకు కోపమొచ్చింది.
* రాజకీయం వేరు సినిమా వేరు. రాజకీయాల్లోకి వెళ్లిపోయాను. గ్లామర్ తగ్గింది. వగరు తగ్గిందనుకుంటున్నారా.. అదే గ్లామర్.. అదే పొగరు.. అదే సొగసుతో మళ్లీ వచ్చింది. రాజకీయం శత్రవులను పెంచుతుంది. సినిమా స్నేహితులను పెంచుతుంది.
* సంక్రాంతికి విడుదలవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దేవీ శ్రీప్రసాద్ చక్కగా సంగీతం కంపోజ్ చేశాడు. ఈ సినిమాలన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.