Chiranjeevi-Venkatesh: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్.. ఫొటోలు వైరల్
ఈ సినిమా టీమ్ ఇవాళ చిరంజీవి విశ్వంభర సెట్స్‌కు వెళ్లింది.

Chiranjeevi
ఒకే ఫ్రేమ్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కనపడుతున్న ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్.
ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఇవాళ చిరంజీవి విశ్వంభర సెట్స్‌కు వెళ్లింది. అక్కడ వారు చిరుతో ఫొటోలు దిగారు. హాయిగా నవ్వుతూ వారు గడిపిన తీరు చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూవీకి వశిష్ట దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది సోషియో ఫాంటసీ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ శనివారం విడుదల కానుంది.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..