Chiranjeevi – Anil Ravipudi : నేడే అనిల్ రావిపూడి – మెగాస్టార్ సినిమా ఓపెనింగ్.. ఇక్కడ లైవ్ చూడండి.. వెంకీమామ గెస్ట్ గా..?

చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ ఇక్కడ లైవ్ చూసేయండి..

Megastar Chiranjeevi Anil Ravipudi Cinema Opening on Ugadi Watch Live Here

Chiranjeevi – Anil Ravipudi : వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టి ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాపై ట్వీట్ వేసి ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు శంకర్ వరప్రసాద్ అని, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది అని తెలిపాడు.

చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాని షైన్ స్క్రీన్స్ తో పాటు చిరంజీవి కూతురు సుస్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నేడు ఉగాది రోజు పూజ కార్యక్రమంతో ఓపెనింగ్ అవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు.

Also Read : NTR – Pradeep : ఎన్టీఆర్ – ప్రదీప్ ఇంత క్లోజా..? మలేషియాకు తీసుకెళ్లి.. ఎన్టీఆర్ తల్లికి ప్రదీప్ అంటే ఎంత ఇష్టమో..

అయితే ఈ ఓపెనింగ్ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా వస్తారని సమాచారం. అలాగే సినిమాలో వెంకిమామ కూడా చిన్న గెస్ట్ రోల్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ ఇక్కడ లైవ్ చూసేయండి..