Chiranjeevi – Pushpa 2 : ‘బాస్’ని కలిసిన పుష్ప నిర్మాతలు, సుకుమార్.. అల్లు అర్జున్ ఎక్కడ?

తాజాగా పుష్ప 2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, దర్శకుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

Chiranjeevi – Pushpa 2 : ‘బాస్’ని కలిసిన పుష్ప నిర్మాతలు, సుకుమార్.. అల్లు అర్జున్ ఎక్కడ?

Megastar Chiranjeevi Appreciates Allu Arjun Pushpa 2 Movie Unit

Updated On : December 5, 2024 / 7:29 PM IST

Chiranjeevi – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి అదరగొడుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో, అల్లు అర్జున్ ఎలివేషన్స్ తో ప్రేక్షకులని, అభిమానులను మెప్పిస్తుంది ఈ సినిమా. అయితే గత ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వివాదం నడుస్తూనే ఉంది. పుష్ప సినిమా విషయంలో కూడా ఈ వార్ సోషల్ మీడియాలో సాగుతుంది.

మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ మధ్య కూడా విబేధాలు వచ్చాయని పలు రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా పుష్ప 2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, దర్శకుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇటీవల చిరంజీవి ఏ సినిమా హిట్ అయినా, తనకు ఏ సినిమా నచ్చినా ఆ మూవీ టీమ్ ని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తున్నారు.

Also Read : Pushpa 3 : పుష్ప 3 కచ్చితంగా తీయాల్సిందే.. పుష్ప 3 కథేంటి? ఇంకో కొత్త విలన్? ఆల్రెడీ కొంత షూటింగ్ పూర్తి..

అయితే పుష్ప 2 సినిమా మెగాస్టార్ చూడకముందే మూవీ యూనిట్ వచ్చి మెగాస్టార్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారని సమాచారం. పుష్ప 2 మంచి హిట్ టాక్ వస్తుండటంతో చిరంజీవి పుష్ప టీమ్ ని అభినందించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే ఈ ఫొటోలో అల్లు అర్జున్ లేకపోవడంతో అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లలేదా? బన్నీకి బిజీగా ఉన్నాడా? అని రకరకాలుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ మెగాస్టార్ ని ఎందుకు కలవలేదు అని ఇప్పుడు చర్చగా మారింది. బన్నీ కూడా వచ్చి ఉంటే ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏమి లేదు అందరూ ఒకటే అని కాస్తయినా ఇరువైపులా ఫ్యాన్స్ కూల్ అయ్యేవారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మెగాస్టార్ పుష్ప 2 సినిమా ఆచూస్తారని సమాచారం. సినిమా చూసాక మెగాస్టార్ బన్నీ ని పిలిచి అభినందిస్తాడేమో చూడాలి.