Upasana : మనవరాళ్లతో మెగాస్టార్.. ఫొటోలో ఇది గమనించారా? ఉపాసన స్పెషల్ పోస్ట్..

మెగాస్టార్ తన మనవాళ్లతో కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Upasana : మనవరాళ్లతో మెగాస్టార్.. ఫొటోలో ఇది గమనించారా? ఉపాసన స్పెషల్ పోస్ట్..

Megastar Chiranjeevi Cute Photo with his all Grand Daughter Shared by Upasana

Updated On : January 26, 2024 / 7:04 PM IST

Upasana : మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) నిన్న కేంద్ర ప్రభుత్వం భారత రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్(Padma Vibhushan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు, సెలబ్రిటీలు అంతా మెగాస్టార్ కి అభినందనలు తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిరంజీవికి స్పెషల్ గా విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ ఆసక్తికర ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవికి స్పెషల్ విషెష్ తెలిపింది. మెగాస్టార్ తన మనవాళ్లతో కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో చిరంజీవి కూర్చొని ఉంటే చుట్టూ ఆయన మనవరాళ్లు ఉన్నారు. పెద్ద కూతురు సుష్మిత ఇద్దరు పిల్లలు, చిన్న కూతురు శ్రీజ ఇద్దరు పిల్లలతో పాటు రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కూడా ఉంది. క్లిన్ కారాని చిరంజీవి ఆయన ఒళ్ళో కుర్చోపెట్టుకున్నారు. ఇలా తన అయిదుగురు మనవరాళ్లతో మెగాస్టార్ క్యూట్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఇటీవల బెంగుళూరులో సంక్రాంతికి చేసుకున్న సెలబ్రేషన్స్ టైంలో తీసినట్టు తెలుస్తుంది.

Megastar Chiranjeevi Cute Photo with his all Grand Daughter Shared by Upasana

Also Read : Boyapati : బోయపాటితో అల్లు అరవింద్ భారీ సినిమా.. హీరోగా అల్లు అర్జున్?

ఉపాసన ఈ ఫోటోని షేర్ చేసి.. మీరు చూస్తుంది ఒక శక్తివంతమైన పిడికిలి నుంచి అయిదు వేళ్ళు. సినిమా పరంగానే కాదు ఒక నాన్నగా, ఒక మామగా, ఒక తాతగా మీరు మాకు స్ఫూర్తి. మీకు పద్మ విభూషణ్ వచ్చినందుకు అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోలో అందరి మనవరాళ్ల ఫేస్ లు చూపించి ఎప్పటిలాగే క్లిన్ కారా ఫేస్ పూర్తిగా కనపడకుండా బ్లర్ చేశారు. దీంతో ఈసారి కూడా క్లిన్ కారా ఫేస్ పూర్తిగా చూద్దామనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశ నిరాశ అయింది. ఇంకెప్పుడు క్లిన్ కారా ఫేస్ చూపిస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)