Boyapati : బోయపాటితో అల్లు అరవింద్ భారీ సినిమా.. హీరోగా అల్లు అర్జున్?

తాజాగా నేడు బోయపాటి నెక్స్ట్ సినిమా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌లో అని ప్రకటించారు.

Boyapati : బోయపాటితో అల్లు అరవింద్ భారీ సినిమా.. హీరోగా అల్లు అర్జున్?

Boyapati Srinu Next Movie announced in Allu Aravind Geetha Arts Allu Arjun will be Hero Rumors goes viral

Updated On : January 26, 2024 / 6:28 PM IST

Boyapati Srinu : మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత స్కంద సినిమాతో రాగా ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆల్రెడీ అఖండ 2 సినిమా ఉంటుందని ప్రకటించాడు బోయపాటి. అల్లు అర్జున్(Allu Arjun), తమిళ్ హీరో సూర్యలతో కూడా సినిమాలు ఉన్నాయని గతంలో బోయపాటి తెలిపారు. తాజాగా నేడు బోయపాటి నెక్స్ట్ సినిమా అల్లు అరవింద్(Allu Aravind) గీత ఆర్ట్స్ లో అని ప్రకటించారు.

మాసివ్ ఫోర్సెస్ అంటూ భారీగా ఈ సినిమా ఉండబోతుంది అని ఈ కాంబోని ప్రకటించారు. గతంలో గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరైనోడు పెద్ద హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ కాంబోలో మళ్ళీ సినిమా ప్రకటించడంతో బన్నీతోనే బోయపాటి సినిమా అని అంతా భావిస్తున్నారు.

Also Read : Niharika Konidela : జనసేన, ఏపీ పాలిటిక్స్ పై నిహారిక సెన్సేషనల్ కామెంట్స్.. ఈసారి కూడా నేను ప్రచారానికి వెళ్తాను..

అల్లు అర్జున్ పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా, సందీప్ వంగతో ఒక సినిమా ఉన్నాయి. మరి వీటిని పక్కన పెట్టి బోయపాటితో పాన్ ఇండియా సినిమా తీస్తాడా? లేక వేరే హీరోతో గీత ఆర్ట్స్ సినిమా చేస్తుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రవితేజ అని కూడా టాక్ నడుస్తుంది. ఆల్రెడీ రవితేజ – బోయపాటి కాంబోలో భద్ర లాంటి పెద్ద హిట్ సినిమా వచ్చింది. మరి గీత ఆర్ట్స్ – బోయపాటి కాంబోలో సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.