Megastar Chiranjeevi: ఈఏపీసెట్ టాపర్ రుషికి మెగా సర్ప్రైజ్.. ప్రత్యేకంగా అభినందించిన చిరంజీవి!
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషిని తన నివాసంలో కలిసిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).
Megastar Chiranjeevi met TGEAPCET state topper M Rushi
- ఈఏపీసెట్ టాపర్ కల నిజమైంది
- విద్యార్థిని రుషిని అభినందించిన చిరంజీవి
- తండ్రి ఇచ్చిన మాట నెరవేరింది
Megastar Chiranjeevi: తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషి అద్భుత ప్రతిభను కనబరిచింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు ఎంతో కాలంగా ఉన్న ఒక పెద్ద కల ఈరోజు నిజమైంది. ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తావని గతంలో రుషి తండ్రి ఆమెకు ప్రామిస్ చేశారు.
Rakul Preet Singh: పార్ట్నర్ మోసం చేస్తే క్షమించొచ్చా.. మాట మార్చిన రకుల్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కడంతో, తండ్రి ఇచ్చిన మాటను మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్వయంగా నిలబెట్టారు. ఈరోజు ఆ యంగ్ అచీవర్ రుషిని చిరంజీవి తన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన అరుదైన విజయానికి గాను మెగాస్టార్ ఆమెను ఎంతో అభినందిస్తూ, శాలువాతో సత్కరించి తన ఆశీస్సులను అందజేశారు.
రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె కెరీర్ ఎంతో బ్రైట్‌గా సాగాలని చిరంజీవి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను కలిసి అభినందనలు అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
