Sam Jam లో చిరు! పిక్స్ వైరల్..

  • Publish Date - November 19, 2020 / 03:41 PM IST

Megastar Chiranjeevi: పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతుంది.



తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ షో లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ‘సామ్ జామ్’ షూటింగ్ జరుగుతోంది.



క్రీమ్ కలర్ ప్యాంటు, వైట్ టీ షర్ట్, గ్రే కలర్ బ్లేజర్, గాగుల్స్‌తో చిరు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు. ఆయనతో పాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల కూడా అటెండ్ అయ్యారు. త్వరలో చిరు ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.