Megastar Chiranjeevi Tweeted On PM Narendra Modi
Chiranjeevi-Modi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. కాగా.. స్టేజీపై మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలపై చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. నాతో, తమ్ముడితో వేదికపై మాట్లాడడం ఎంతో ఆనందంగా అనిపించిందని చిరంజీవి అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మొదటిసారి పవన్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ప్రధాని చూసినట్లుగా చెప్పారని చిరు చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు అందులో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని మెచ్చుకున్నారు. ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయని చెప్పారు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో మా సంభాషణ కలకాలం గుర్తిండిపోయే ఓ అపురూప జ్ఞాపకం అని చిరు తెలిపారు.
Devara : ఎన్టీఆర్ అభిమానులకు పండగే.. చెప్పిన తేదీ కంటే రెండు వారాల ముందుగానే వస్తున్న దేవర
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని… pic.twitter.com/ZYg9YsSh6o— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2024