‘‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు’’ చేసిన చిరు..

లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుండి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు.
ఆదివారం ఉదయం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అది విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే విజయవాడలో నిన్న జరిగిన విషాద ఘటనతో కలత చెందిన చిరు.. ఈ వీడియో విడుదలను వాయిదా వేసి, సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. మెగా మదర్ అంజనా దేవి ఆప్యాయంగా చిరుకి ముద్దలు తినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరు కోడలు ఉపాసన ‘మామా యువర్ ది బెస్ట్’ అని కామెంట్ చేయగా పెద్ద కుమార్తె సుస్మిత మాత్రం ‘డాడీ నా షేర్ ఏది?’ అని అడిగింది. చిరు లాక్‌డౌన్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ షూటింగులో పాల్గొంటారు.
https://www.instagram.com/tv/CDshKfODBsx/?utm_source=ig_web_copy_link