Chiranjeevi : అభిమానులు జీవితంలో లక్ష్యం లేకుండా తిరుగుతారు.. వేరే హీరో ఫ్యాన్స్‌తో గొడవలు పడతారు.. అభిమానులపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..
తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ ని అభినందించారు. చిరంజీవి ఈ ఈవెంట్ లో సినిమా గురించి, అలాగే అభిమానుల గురించి మాట్లాడారు.

Megastar Chiranjeevi Sensational Comments on Fans at Baby Movie Success Event
Megastar Chiranjeevi : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరి అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న అల్లు అర్జున్ ఈవెంట్ చేయగా, తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ ని అభినందించారు.
ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. బేబీ సినిమా దర్శకుడు, నిర్మాత, టీంలో చాలా మంది మెగాస్టార్ ఫ్యాన్స్ అవ్వడంతో మాట్లాడిన వాళ్లంతా చిరంజీవి గురించి, చిరంజీవి సినిమాలతో తమకు ఉన్న అనుభవం గురించి తెలిపారు. దీంతో చిరంజీవి ఈ ఈవెంట్ లో సినిమా గురించి, అలాగే అభిమానుల గురించి మాట్లాడారు.
Baby Movie : బేబీ మూవీ మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలు..
చిరంజీవి మాట్లాడుతూ.. ఎస్కేఎన్, సాయిరాజేష్ ఎప్పటినుంచో తెలుసు. వాళ్లను నేను తరుచూ కలవకున్నా వాళ్లు చేసే సినిమా ప్రయత్నాల గురించి వింటూనే ఉంటాను. అభిమానులు అంటే థియేటర్ లో సినిమా చూసే దగ్గరే ఆగిపోవడం కాదు. ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్పూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చా తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. హీరోల అభిమానులంటే ఒక లక్ష్యం లేకుండా తిరుగుతారు, చదువుల మీద శ్రద్ధ పెట్టరు. మరో హీరో అభిమానులతో గొడవలు పడతారు అనే రోజుల నుంచీ అభిమానుల గురించి నాకు తెలుసు. అభిమానుల గొడవలు నా చెవిన పడిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి నా అభిమానులంటే సమాజం గర్వించేలా ఉండాలని, వారిని అందులో భాగం చేయాలని నిర్ణయించుకున్నాను. మారుతి, సాయిరాజేష్, ఎస్కేఎన్ వంటి నా ఫ్యాన్స్ కలిసి చేసిన సినిమా ఘన విజయం సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వాళ్ల సంతోషంలో నేనూ ఒక భాగమవ్వాలని ఈ కార్యక్రమానికి వచ్చాను అని తెలిపారు. దీంతో చిరంజీవి అభిమానులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.