Vishwambhara: మెగా విజువల్ వండర్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
జులై లో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర(Vishwambhara)' మూవీ.
Megastar Chiranjeevi Vishwambhara movie Release Date update
- వాయిదాల తర్వాత పక్కా డేట్
- 2026 జూలైలో ‘విశ్వంభర’ రాక
- విశ్వంభర విడుదలపై క్రేజీ అప్డేట్.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ మధ్య టీజర్ విడుదల తర్వాత వీఎఫ్ఎక్స్పై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు.
Paramapada Sopanam: వైవిధ్యమైన కథతో ‘పరమపద సోపానం’.. విడుదలకు సిద్ధమైన అర్జున్ అంబటి మూవీ
తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రాన్ని 2026 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విడుదల తేదీని పవర్ఫుల్ వీడియో ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి, ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. రెండేళ్లుగా ఊరిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారను.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సోషియో ఫ్యాంటసీ జోనర్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చిరంజీవి తన 158వ చిత్రాన్ని ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీతో చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలుకానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి స్టార్ కానుంది.
