Meghana Raj Sarja : జూనియర్ చిరు పేరు రివీల్ చేసిన మేఘన..! వీడియో వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ సర్జా తమ కుమారుడి పేరుని రివీల్ చేశారు..

Meghana Raj Sarja
Meghana Raj Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ నటుడు చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య మేఘనా రాజ్, ఆమె తల్లిదండ్రులు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వారే. మేఘనా రాజ్ తెలుగులో ‘బెండు అప్పారావు R.M.P’, ‘లక్కీ’ సినిమాలు చేసింది. పదేళ్ల రిలేషన్ తర్వాత 2018 మే 2న ఆమె చిరంజీవి సర్జాను పెళ్లాడారు.
రెండేళ్లకే భర్తను కోల్పోయిన మేఘనా రాజ్ బాధ వర్ణనాతీతం. చిరు చనిపోయేనాటికి ఆమె నాలుగు నెలల గర్భవతి. భర్త మరణించినప్పుడు ఆమె రోదన, అతని కటౌట్ పెట్టుకుని సీమంతం వేడుక జరుపుకోవడం వంటి సంఘటనలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. భర్తను గుర్తు చేసుకుంటూ మేఘన పెట్టిన ఎమోషనల్ పోస్టులు వైరల్ అయ్యాయి.
గతేడాది అక్టోబర్ 22న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటినుండి తమ అభిమాన నటుడి తనయుడుని జూనియర్ చిరు అని పిలుస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా బాబు పేరు రివీల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ వీడియో షేర్ చేశారు మేఘన. బాబుకి రాయన్ రాజ్ సర్జా అని నామకరణం చేశారు.
బాబు అచ్చు చిరంజీవి సర్జాలానే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మేఘన షేర్ చేసిన రాయన్ వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి తమ్ముడు ధృవ సర్జా కన్నడలో మాస్ హీరోగా, ‘యాక్షన్ ప్రిన్స్’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రష్మిక మందన్నతో కలిసి నటించిన ‘పొగరు’ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇందులో ‘మైండు కరాబు’ అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
View this post on Instagram