Mehreen Pirzada : వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించినందుకు విమర్శలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయిన మెహ్రీన్..

మెహ్రీన్ నటించిన సుల్తాన్ అఫ్ ఢిల్లీ(Sultan of Delhi) అనే సిరీస్ ఇటీవల హాట్ స్టార్(Hotstar) లోకి వచ్చింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది.

Mehreen Pirzada : వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించినందుకు విమర్శలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయిన మెహ్రీన్..

Mehreen Pirzada Fires on Trolls about her Sultan of Delhi Series

Updated On : October 18, 2023 / 9:36 AM IST

Mehreen Pirzada : ఇటీవల హీరోయిన్స్ అంతా ఓటీటీల్లోకి(OTT) ఎంట్రీ ఇచ్చి బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతున్నారు. ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో, సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్ ఇక్కడ కూడా వస్తుండటంతో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఓటీటీలో బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్తున్నారు. ఇటీవల తమన్నా ఓటీటీ సిరీస్ లలో రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ లో నటించింది. తాజాగా మెహ్రీన్ కూడా బోల్డ్ సీన్స్ లో నటించింది.

మెహ్రీన్ నటించిన సుల్తాన్ అఫ్ ఢిల్లీ(Sultan of Delhi) అనే సిరీస్ ఇటీవల హాట్ స్టార్(Hotstar) లోకి వచ్చింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. దీంతో ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది మెహరీన్ పై ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించినందుకు విమర్శలు చేస్తున్నారు. అయితే తనపై వచ్చిన విమర్శలకు మెహ్రీన్ సోషల్ మీడియాలో ఫైర్ అయింది.

Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు వేడుకల్లో అల్లు అర్జున్ సందడి..

మెహ్రీన్ తనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ట్విట్టర్ లో.. నేను ఇటీవల ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే సిరీస్ చేశాను. కొన్ని కథలు అలాంటి సీన్స్ ని డిమాండ్ చేస్తాయి. నేను ఒక యాక్టర్ గా అలాంటి సన్నివేశాలను కథలో భాగంగా చేస్తాను. అందులో చూపించిన సీన్ పెళ్లి తర్వాత ఇష్టం లేకుండా జరిగే శృంగారం వంటిది. ఇది చాలామందిని బాధపెడుతోంది. చాలామంది మహిళలు దీనివల్ల సమాజంలో బాధపడుతున్నారు. కానీ ఇది ఒక నార్మల్ సెక్స్ సీన్ అని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది ఇలా నెగిటివ్ గా ప్రచారం చేయడం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా మాట్లాడే వాళ్ళకి సోదరీమణులు, కూతుర్లు ఉంటారు, వారికి ఇలాంటివి జరగకూడదని ప్రార్ధిస్తున్నాను. ఒక యాక్టర్ గా నేను నటించాను, ఆ సన్నివేశాలేవి నాకు ఇబ్బంది కలిగించలేదు. నేను ఒక నటిగా ఆడియన్స్ కి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అది ఏ పాత్ర అయిన సరే అంటూ ట్వీట్ చేసింది. దీంతో మెహ్రీన్ ట్వీట్ వైరల్ గా మారగా దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.