Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లిపై తల్లి మేనక క్లారిటీ.. ఏమందంటే..?
అందాల భామ కీర్తి సురేష్ తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కీర్తి సురేష్ త్వరలోనే ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడబోతుందని.. ఈ సంబంధం కీర్తి తల్లిదండ్రులు చూశారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Menaka Suresh Clarity On Keerthy Suresh Marriage
Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్ తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని, వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్. అయితే తన కెరీర్‌లో ఎలాంటి కాంట్రోవర్సీలకు చోటివ్వలేదు ఈ స్టార్ బ్యూటీ.
Keerthy suresh : దసరా సినిమాలోని కీర్తి సురేష్ స్టిల్స్..
కాగా, ఇటీవల కీర్తి సురేష్ పెళ్లి గురించి నెట్టింట ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. కీర్తి సురేష్ త్వరలోనే ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడబోతుందని.. ఈ సంబంధం కీర్తి తల్లిదండ్రులు చూశారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా ఈ వార్తలపై కీర్తి సురేష్ తల్లి మేనక క్లారిటీ ఇచ్చింది. తమ కూతురు పెళ్లి గురించి ఏదైనా వార్త ఉంటే, తామే స్వయంగా అందరికీ చెబుతామని మేనక చెప్పుకొచ్చింది. తమ కూతురు ఎవరితోనూ ప్రేమలో లేదని.. అలాగే ఆమెకు పెళ్లి ఎప్పుడు చేయాలో తమకు తెలుసని మేనక చెప్పుకొచ్చింది.
Keerthy Suresh: అందాలను ఆరబోస్తున్న కీర్తి.. చీరకట్టులోనూ సెగలు రేపుతోందిగా
ఇలా తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మేనక క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పుడు కీర్తి సురేష్‌కు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టమయ్యింది. ఇక ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో చిరు సోదరిగా మనకు కీర్తి సురేష్ కనిపించనుంది.