Minister Kandula Durgesh Press meet
రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల గురించి ఆయన మాట్లాడారు.
సినీ ప్రముఖులు కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ అభివృద్ది చెందాలంటే ప్రభుత్వ సహకారం అవసరం అని అన్నారు.
Dacoit : అదిరిపోయిన అడివి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
గత ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని వేధించిందన్నారు. తాము మాత్రం సినీ పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్నారు. టికెట్ రేట్లు పెంచామని, షూటింగ్ లకి అనుమతులిచ్చామన్నారు.
పవన్ సినిమా రిలీజ్ టైమ్ లోనే ధియేటర్ల బంద్ ఎందుకు? అసలు బంద్ లేదు అన్న మాట ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు రాలేదని ఏనాడూ అన్యాయం చేయలేదన్నారు.
‘నిర్మాతలు వచ్చి కలవండి. నిర్మాతలు, ఛాంబర్ కలసి రావాలని నేను లేఖ రాశా. ప్రభుత్వం సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు వచ్చినా రాకపోయినా సహకారం అందిస్తూ ఉంటాం. ఆ నలుగురు ఎవరనేది ఏదో ప్రచారం ఉంది. నాకు తెలీదు. సినిమా ధియేటర్ల విషయంలో అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవమే.’ అని మంత్రి అన్నారు.