Komatireddy Venkat Reddy : చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి సత్కారం.. భారతరత్న కూడా రావాలని

పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సత్కరించారు. చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి అభినందనలు తెలిపారు.

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం రావడం పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా చిరంజీవి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.

Vyjayanthimala : చిరంజీవితో పాటు పద్మవిభూషణ్ అందుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ దక్కింది. ఈ సందర్భంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. జూబ్లిహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి  వెళ్లిన కోమటిరెడ్డి అభినందనలు తెలిపి శాలువాతో చిరంజీవిని సత్కరించారు. కోమటిరెడ్డితో పాటు  ప్రముఖ నిర్మాత , ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు దిల్ రాజు కూడా ఉన్నారు.

Chiranjeevi : తనకు పద్మవిభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఏమన్నారో తెలుసా?

చిరంజీవి పద్మవిభూషణ్ సత్కారానికి ఎంపిక కావడం తనకెంతో సంతోషంగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . భవిష్యత్తులో చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలని ఆకాంక్షించారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం విశ్వంభర దాకా విజయవంతంగా సాగుతోందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాదిమంది గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మరోవైపు అనేకమంది సినీ ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు చెబుతున్నారు. దీంతో ఆయన నివాసం సందడిగా మారిపోయింది.