Chiranjeevi : తనకు పద్మవిభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఏమన్నారో తెలుసా?

తనకు పద్మవిభూషణ్ రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత ప్రభుత్వానికి, కోట్లాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

Chiranjeevi : తనకు పద్మవిభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఏమన్నారో తెలుసా?

Chiranjeevi

Updated On : January 26, 2024 / 8:18 AM IST

Chiranjeevi : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ వరించింది. తనకు ఈ సత్కారం లభించడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. భారత ప్రభుత్వానికి, తన అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు.

Pawan Kalyan : చిరంజీవి, వెంకయ్యనాయుడులతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి 45 సంవత్సరాలుగా వెండితెరపై తన నటనతో అలరిస్తున్నారు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ లక్షలాదిమంది మనసులు గెలుచుకున్నారు. 150కి పైగానే సినిమాల్లో నటించిన చిరంజీవికి అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్’ దక్కింది. 75వ గణతంత్ర దినోత్సవ వేళ దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ గారి చేతుల మీద ‘పద్మభూషణ్’ అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి అందుకున్న ప్రతిష్టాత్మక పురస్కారాల్లో పద్మవిభూషణ్ చేరింది. దీనిపై చిరంజీవి స్పందించారు.

Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

తనకు పద్మవిభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చిరంజీవి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను సొంతమనిషిలా.. తమ అన్నయ్యలా, తమ బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే తను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానన్నారు చిరంజీవి. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అన్నారు. 45 సంవత్సరాల తన సినీ ప్రస్ధానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి తను శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నానని.. నిజ జీవితంలో తన చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనపుడు కూడా చేతనైనా సాయం చేస్తున్నానని చెప్పారు చిరంజీవి. తనపై ప్రజలంతా చూపిస్తున్న అభిమానానికి ప్రతిగా తాను ఇచ్చేది గోరంతే అని అదే బాధ్యతగా తనను ముందు నడిపిస్తుందని చెప్పారు. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు తనను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు దేశ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రజలు అభినందనలు చెబుతున్నారు.