Vyjayanthimala : చిరంజీవితో పాటు పద్మవిభూషణ్ అందుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవితో పాటు అలనాటి నటి పద్మవిభూషణ్‌కి ఎంపికయ్యారు. మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ నటి ఎవరంటే?

Vyjayanthimala : చిరంజీవితో పాటు పద్మవిభూషణ్ అందుకుంటున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

Vyjayanthimala

Updated On : January 26, 2024 / 9:16 AM IST

Vyjayanthimala : దేశంలోనే అత్యున్నత రెండో పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్’ అలనాటి నటి వైజయంతిమాలని వరించింది. నటిగా, డాన్సర్‌గా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో సేవలందించిన వైజయంతిమాలకు అ అవార్డు దక్కడం విశేషం.

Chiranjeevi : తనకు పద్మవిభూషణ్‌ ప్రకటించడంపై చిరంజీవి ఏమన్నారో తెలుసా?

నటిగా, డాన్సర్‌గా, గాయనిగా, కొరియోగ్రాఫర్‌గా అలరించారు అలనాటి నటి వైజయంతిమాల. గతంలో పార్లమెంటు సభ్యురాలిగా కూడా ఉన్నారు. మొదటి మహిళా సూపర్ స్టార్‌గా ఆమెను కొనియాడతారు. 1949 లో ‘వజ్కై’ అనే తమిళ సినిమాతో కెరియర్ మొదలుపెట్టారు వైజయంతిమాల. 1950లో ‘జీవితం’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. బహార్, లడ్కీ, నాగిన్, దేవదాస్, న్యూఢిల్లీ, నయా దౌర్, మధుమతి, గంగా జుమ్నా, జూలా, సంగం, ఆమ్రపాలి, గన్వార్ వంటి అనేక సినిమాల్లో నటించారు. తెలుగులో జీవితం, సంఘం, వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్ గజదొంగ, విరిసిన వెన్నెల, వీర సామ్రాజ్యం, చిత్తూరు రాణీ పద్మిని వంటి సినిమాల్లో నటించారు. వైజయంతిమాల భరతనాట్య కళాకారిణి, గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. మంచి పీక్‌లో ఉన్నప్పుడే సినిమాలు చేయడం విరమించుకున్నారు.

నటిగానేక కాకుండా వైజయంతిమాల డ్యాన్సర్‌గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. భరతనాట్య కళాకారిణి అయిన ఆమె దేశ విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో భరతనాట్యం చేసిన మొట్టమొదటి భారతీయ నృత్యకారిణి వైజయంతిమాల కావడం విశేషం. ఆమె నటనను మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 1968లో భారత ప్రభుత్వం వైజయంతిమాలను ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. తాజగా మరో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ ఆమెకు దక్కింది. గురువారం భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మవిభూషణ్ అందుకుంటున్న ఐదుగురిలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు వైజయంతిమాల కూడా ఈ సత్కారం అందుకోబోతుండటం విశేషం.

Pawan Kalyan : చిరంజీవి, వెంకయ్యనాయుడులతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

సినిమాలు మాత్రమే కాదు అటు రాజకీయాల్లోనూ వైజయంతిమాల చురుగ్గా ఉండేవారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.  90 ఏళ్లకు పైబడిన వైజయంతిమాల ఇప్పటికీ తనకెంతో ఇష్టమైన డ్యాన్స్ పట్ల ఎంతో అభిమానం చూపిస్తారు. ఇటీవల కొన్ని డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పద్మ అవార్డ్స్‌ను ఏటా మార్చి లేదా ఏప్రియల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈసారి పద్మవిభూషణ్ -5 ,  పద్మభూషణ్- 17,  పద్మశ్రీ -110 మంది అందుకోబోతున్నారు.