Miss Shetty Mr Polishetty : యూఎస్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రికార్డు.. ఫస్ట్ వీకెండ్‌తోనే..

యూఎస్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఆడియన్స్ ని విపరీతంగా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం..

Miss Shetty Mr Polishetty : యూఎస్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రికార్డు.. ఫస్ట్ వీకెండ్‌తోనే..

Miss Shetty Mr Polishetty cross 1 million mark at USA box office

Updated On : September 11, 2023 / 5:26 PM IST

Miss Shetty Mr Polishetty : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), యువ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) క‌లిసి న‌టించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేశాడు. సెప్టెంబ‌ర్ 7న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఒక పక్క షారుఖ్ ఖాన్ జవాన్ ఉన్నపటికీ.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద మెల్లిమెల్లిగా పుంజుకుంటూ వస్తుంది.

Jawan Collections : బాక్సాఫీస్ పై బాలీవుడ్ బాద్ షా దండ‌యాత్ర‌.. నాలుగు రోజుల్లో 520 కోట్లు

ఇక యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని ఎన్ఆర్ఐ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి కూడా రిలీజ్ డే నుంచి అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న ప్రమోషనల్ టూర్ అక్కడి వారిని సినిమా వైపు ఆకర్షిస్తోంది. దీంతో ఈ చిత్రం మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి 1M డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్ లో ఇది రెండో మిలియన్ డాలర్ మూవీ.

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ రూలింగ్ అప్పటి నుంచే..

నవీన్ గత సినిమా జాతిరత్నాలు అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద వన్ మిలియన్ మార్క్ ని అందుకుంది. అయితే జాతిరత్నాలు ఫుల్ రన్ లో మిలియన్ మార్క్ ని అందుకుంటే.. ఈ చిత్రం మూడు రోజుల్లోనే క్రాస్ చేసేసింది. నవీన్ హీరోగా నటించిన మూడు సినిమాల్లో రెండు చిత్రాలు మిలియన్ మార్క్ ని అందుకోవడం గమనార్హం. అలాగే ఈ మూవీ సక్సెస్ తో నవీన్ హ్యాట్రిక్ హిట్టుని సొంతం చేసుకున్నాడు. కాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫుల్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.