Mitraaw Sharma : మిస్టర్ చీటర్ అంటూ హర్షసాయి పై పోస్ట్ పెట్టిన బిగ్ బాస్ భామ.. మళ్ళీ పారిపోయావా అంటూ..
మిత్ర శర్మ హర్ష సాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Mitraaw Sharma Sensational Post on Harsha Sai Regarding Betting
Mitraaw Sharma : యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న హర్ష సాయి గతంలో హీరోగా చేస్తున్నాను అని ఒక సినిమా ప్రకటించాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఆ సినిమా నిర్మాత, బిగ్ బాస్ భామ, నటి మిత్ర శర్మ హర్ష సాయి పై లైంగిక వేధింపులు చేసాడని, ఆ సినిమా కాపీ రైట్ విషయంలో తనని వేధించాడని కేసు పెట్టింది. అప్పుడు హర్ష సాయి కనపడకపోవడం, విదేశాలకు పారిపోయాడని వార్తలు రావడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత హర్ష సాయి తిరిగొచ్చాక ఆ కేసు నడుస్తుంది.
ఇటీవల ఆర్టీసీ ఎండి, ఐపీఎస్ సజ్జనార్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్ల భరతం పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ వీడియోలను తన సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఇద్దరిని అరెస్ట్ చేసారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేయడం, అవి చేస్తాను అని ఇంటర్వ్యూలలో చెప్పడంతో సజ్జనార్ అతని గురించి కూడా పోస్ట్ చేసారు.
పోలీసులు ఇప్పటికే హర్ష సాయిపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. అయితే హర్ష సాయి కనపడట్లేదని సమాచారం. ఇలాంటి సమయంలో మిత్ర శర్మ హర్ష సాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
మిత్ర శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. హలో మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావ్ అంట కదా. నువ్వు మమ్మల్ని చీట్ చేసి మా జీవితాలను నాశనం చేసావు. ఇప్పుడు కర్మ నీకు తగులుతుంది. ఇప్పటికైనా నా మాట విని చేంజ్ అవ్వు, సమాజానికి, నీ ఫాలోవర్స్ కి సారీ చెప్పి ఇంక నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని వీడియోస్ చేసి నీ తప్పులు ఒప్పుకో అందరి ముందు. ఈ రోజే బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అవ్వు. అని పోస్ట్ చేసింది.
Also Read : Nabha Natesh : ఇంత హాట్ గా కూడా పార్టీ చేసుకుంటారా..? నభా నటేష్ పిజ్జా పార్టీ ఫొటోలు వైరల్..
అలాగే సజ్జనార్ సర్ మీ వల్ల చాలా ఫ్యామిలీస్ ఫ్యూచర్ బాగుంటుంది. అన్వేష్ గారు మీరు మంచి పని చేసారు అని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి కంప్లైంట్ చేసిన అన్వేష్ ని, సజ్జనార్ ని అభినందించింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి దీనిపై హర్ష సాయి స్పందిస్తాడా చూడాలి.