సంక్రాంతి సంబరాల్లో ఆర్కే రోజా: స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరంటే?

  • Published By: vamsi ,Published On : January 13, 2020 / 02:35 AM IST
సంక్రాంతి సంబరాల్లో ఆర్కే రోజా: స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరంటే?

Updated On : January 13, 2020 / 2:35 AM IST

వెటరన్ హీరోయిన్, APIIC ఛైర్మన్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా చేస్తూ సంక్రాంతి టీవీ ప్రోగ్రామ్‌లలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ లలో పాల్గొంటున్న రోజా  సొంత నియోజకవర్గం నగరిలో కూడా సందడి చేస్తున్నారు. పండుగ పూట నియోజకవర్గంలో సందడి మొదలెట్టేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు రోజా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Sankranthi #Celebrations ? @pattusareesbysai #Nagari #RojaSelvamani #RojaCharitableTrust

A post shared by Roja Selvamani (@rojaselvamani) on

సంక్రాంతికి పట్టుచీరలో కుటుంబంతో సహా.. ఆమె చేస్తున్న సందడిని అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం సందడిగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే.. రోజా తన కూతురు అన్షూమాలికని కూడా తన పండుగ ఫోటోల్లో, వీడియోల్లో హైలెట్ చేసి చూపించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#RojaCharitableTrust , Nagari #Sankranthi #RojaSelvamani

A post shared by Roja Selvamani (@rojaselvamani) on

ఎద్దుల బండిన స్వయంగా తోలిన రోజా.. ముగ్గులు వేశారు. పిల్లలకు బోగిపళ్లు పోశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజా కూతురు అన్షూ ఆ ఫోటోల్లో స్పెషల్ ఎట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు. వైసీపీ అభిమానులు, రోజా అభిమానులూ వాటిని షేర్ చేస్తూ ఉన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#HappyBirthdayAnshu?

A post shared by Roja Selvamani (@rojaselvamani) on