Mega Moment : ఇవాళ మెగా ఫ్యాన్స్‌కి పండగే.. చిరు, పవన్‌ని దగ్గరకు తీసుకున్న మోదీ.. నేషనల్ లెవల్‌లో మెగా క్రేజ్..

ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి దగ్గరికి తీసుకువచ్చి ఇద్దర్ని అభినందించారు.

Modi Hugs Pawan Kalyan and Chiranjeevi on Stage Photos and Videos goes Viral

PM Modi – Chiranjeevi -Pawan Kalyan : నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా హోరెత్తింది. పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అనేక ఆసక్తికర సంఘటనలు నెలకొన్నాయి.

చిరంజీవి స్టేట్ గెస్ట్ గా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వేదికపైనే కూర్చున్నారు. పవన్ ప్రమాణ స్వీకారం అయ్యాక చిరంజీవి వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించారు. అయితే కార్యక్రమం అంతా అయ్యాక ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి దగ్గరికి తీసుకువచ్చి ఇద్దర్ని అభినందించారు. చిరు, పవన్ ఇద్దర్ని మోదీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ముగ్గురు కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేసారు.

Also Read : Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే.. ఏమని ప్రమాణం చేశారంటే..

దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా అయ్యాయి. స్వయంగా మోదీనే వచ్చి చిరు, పవన్ లను దగ్గరకు తీసుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. ఏపీలో కూటమి ఏర్పడటానికి, గెలవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. ఏపీ గెలుపు నేషనల్ వైడ్ వైరల్ అవ్వడంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఢిల్లీలో మోదీ అందరి ముందు పవన్ ని సునామి అంటూ పొగడటంతో పవన్ క్రేజ్ నేషనల్ వైడ్ పెరిగింది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దర్ని మోదీ సంతోషంగా హత్తుకోవడంతో నేషనల్ వైడ్ మెగా క్రేజ్ అని మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగా అభిమానులు పవన్ – మోదీ – చిరంజీవి ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు.