Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే.. ఏమని ప్రమాణం చేశారంటే..

పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మాట్లాడిన పూర్తి స్పీచ్ ఇదే..

Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే.. ఏమని ప్రమాణం చేశారంటే..

Pawan Kalyan Full Speech in Taking Oath Ceremony as AP Minister

Updated On : June 12, 2024 / 12:59 PM IST

Pawan Kalyan : నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా హోరెత్తింది.

పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మాట్లాడిన పూర్తి స్పీచ్ ఇదే..

”కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని.. భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చింది ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రమాణ స్వీకారం చేసారు పవన్.

Also Read : Pawan – Chiranjeevi : వేల మంది ముందు.. అతిరథమహారథుల ముందు.. అన్నయ్య కాళ్లకు నమస్కరించిన పవన్..

ఎన్నో ఏళ్లుగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఇలా ప్రమాణ స్వీకారం చేయాలని కలలు కన్నారు. ఇవాళ ఆ కల నెరవేరడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ ప్రమాణ స్వీకారం వీడియోని వైరల్ చేస్తున్నారు.