Pawan – Chiranjeevi : వేల మంది ముందు.. అతిరథమహారథుల ముందు.. అన్నయ్య కాళ్లకు నమస్కరించిన పవన్..

ఇన్ని వేల మంది ముందు, దేశవ్యాప్తంగా వచ్చిన అతిరథమహారథుల ముందు పవన్ కళ్యాణ్ వెళ్లి చిరంజీవి కాళ్ళ మీద పడటంతో పవన్ ని మరోసారి అంతా అభినందిస్తున్నారు.

Pawan – Chiranjeevi : వేల మంది ముందు.. అతిరథమహారథుల ముందు.. అన్నయ్య కాళ్లకు నమస్కరించిన పవన్..

Pawan Kalyan Takes Blessings from Megastar Chiranjeevi in Taking Oath Ceremony Event

Pawan Kalyan – Chiranjeevi : నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా హోరెత్తింది. పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా విచ్చేసారు.

చిరంజీవి స్టేట్ గెస్ట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు నమస్కరించారు. అనంతరం స్టేజిపై ఉన్న అందరు ప్రముఖులకు నమస్కరిస్తూ వెళ్లారు. చివరగా చిరంజీవి వద్దకు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించాడు పవన్. చిరంజీవి పవన్ ని దగ్గరకు తీసుకొని ఆనందంతో ఆత్మీయంగా హత్తుకున్నాడు.

Also Read : Pawan Kalyan – Chiranjeevi : పవన్ ప్రమాణ స్వీకారం.. అన్నయ్య ఆనందం.. వీడియో తీస్తున్న భార్య..

దీంతో అన్నదమ్ముల అనుబంధం వైరల్ గా మారింది. పవన్ గెలిచినప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి ఫుల్ సంతోషంలో ఉన్నారు. తన వల్ల కాలేనిది పవన్ సాధించాడు అని ఆనందంతో ఉన్నారు మెగాస్టార్. ఇప్పటికే పవన్, చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన వీడియోలు చూసి, అందులో ఈ అన్నదమ్ముల అనుబంధం చూసి మెగా అభిమానులు ఆనంద భాష్పాలు కార్చారు. ఇప్పుడు ఇన్ని వేల మంది ముందు, దేశవ్యాప్తంగా వచ్చిన అతిరథమహారథుల ముందు పవన్ కళ్యాణ్ వెళ్లి చిరంజీవి కాళ్ళ మీద పడటంతో పవన్ ని మరోసారి అంతా అభినందిస్తున్నారు. మెగా అభిమానులకు మాత్రం ఇవాళ కడుపు నిండిపోయింది అని చెప్పొచ్చు.