Mohan Babu: ఆ బాధ జీవితాంతం ఉంటుంది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి రోజున ఎమోషనల్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు(Mohan Babu).
- V Santhosh Kumar
- Published on- May 5, 2026 / 06:47 PM IST
Mohan Babu emotional comments about Dasari Narayana Rao.
- ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుక.
- దాసరి సేవలను కొనియాడిన మోహన్‌బాబు.
- అసోసియేషన్‌కు పదిహేను లక్షల విరాళం.
Mohan Babu: దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘డైరెక్టర్స్ డే 2026’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సీనియర్ నటులు మోహన్‌బాబు, బాబూమోహన్, జయసుధ, జయప్రదలతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పరిశ్రమకు దాసరి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ వేడుక మొత్తం దాసరి స్మృతులతో ఎంతో భావోద్వేగంగా సాగింది.
Jana Nayagan: ‘జన నాయగన్’ టైటిల్ మార్పు.. కొత్త టైటిల్ ఇదే.. సోషల్ మీడియా ఫ్యాన్స్ ట్రెండ్
ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్‌బాబు(Mohan Babu) మాట్లాడుతూ దాసరితో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎక్కడో ఉన్న తనను వెండితెరకు పరిచయం చేసి, మోహన్‌బాబుగా పేరు మార్చి ఈ స్థాయికి తెచ్చిన గురువు దాసరి అని ఆయన ఆవేదన చెందారు. దర్శకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం దాసరి అని కొనియాడారు. తన కృతజ్ఞతగా డైరెక్టర్ అసోసియేషన్‌కు రూ.15 లక్షల విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
నటి జయసుధ మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో దర్శకుడి పాత్ర అత్యంత కీలకమని, ఎంతో మంది స్టార్లను సృష్టించిన ఘనత దాసరిదేనని అన్నారు. ప్రపంచంలో ఏ అవార్డు వచ్చినా దాసరి చేతుల మీదుగా అందుకునే గౌరవం ముందు అది చిన్నదేనని ఆమె అభిప్రాయపడ్డారు. దాసరి నారాయణరావు కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదని, ఎంతో మంది నటీనటుల జీవితాలను తీర్చిదిద్దిన శిల్పి అని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ వేడుక తెలుగు చిత్రసీమలో దర్శకుల ప్రాధాన్యతను చాటిచెప్పింది.
