Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడిపై మోహన్‌బాబు ఆగ్రహం

'మా' ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రంలో మోహన్ బాబు పర్యవేక్షకునిగా ఉన్నారు.

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడిపై మోహన్‌బాబు ఆగ్రహం

Prakash Raj (1)

Updated On : October 10, 2021 / 6:54 PM IST

Maa Elections 2021: ‘మా’ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రంలో మోహన్ బాబు పర్యవేక్షకునిగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ మెంబర్ రమణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంచు విష్ణు రమణా రెడ్డిని సముదాయించి కూర్చోబెట్టారు. ఈ సమయంలో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం కనిపించింది.

ఇక ఉత్కంఠగా సాగుతున్న మా ఎన్నికల కౌంటింగ్‌లో మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రకాష్ రాజ్ ఈసీ మెంబర్లలకు మెజార్టీ వచ్చినట్లుగా తెలుస్తుంది. అనసూయ లీడింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. మా ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే పోలింగ్‌ కూడా గతంలో కంటే ఈసారి భారీగా నమోదైంది. పెద్ద సంఖ్యలో సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడం మంచి పరిణామం అన్నారు ప్రకాశ్ రాజ్.

హీరో శ్రీకాంత్ కూడా మా ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగిందన్నారు. పెద్ద హీరోలు కొంతమంది షూటింగ్‌లో ఉండటంతో ఓటు వినియోగించుకోలేకపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నో సంఘటనలు, ఏవో మాటలు అనుకున్నామని, అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అందరూ ఓటింగ్‌కి వచ్చినట్లు చెప్పారు.