Mohan Babu Respond his absconding news
జర్నలిస్టు పై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. అయితే.. ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిందని, అప్పటి నుంచి మోహన్ బాబు పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మోహన్ బాబు స్పందించారు.
అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదన్నారు. తన ఇంట్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
Allu Arjun : మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న చిరంజీవి సతీమణి సురేఖ
‘ఫేక్ వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయి. నా ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం నా ఇంట్లోనే ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. వాస్తవాలను తెలుసుకుని మాత్రమే మాత్రమే వార్తలు రాయాలని మీడియాను కోరుతున్నాను.’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
మోహన్ బాబు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అయితే.. ఆయన అందుబాటులో లేకుండా పోయాడనే వార్తలు వచ్చాయి. ఆయన కోసం ఐదు బృందాలుగా ఏర్పడి ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడులో పోలీసులు గాలిస్తున్నారని సదరు వార్తాల సారాంశం. ఇప్పుడు స్వయంగా మోహన్ బాబు స్పందించడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది.
Allu Arjun : అల్లు అర్జున్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే రాత్రంతా జైలులో ఉంచారా?
False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.
— Mohan Babu M (@themohanbabu) December 14, 2024