Mohan Babu : త్వరలో ‘మోహన్‌బాబు యూనివర్సిటీ’

తాజాగా మరో కీలక విషయం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోహన్ బాబు. త్వరలో “మోహన్ బాబు యూనివర్సిటీ”ని ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ''శ్రీ విద్యానికేతన్‌లో...

Mohan Babu :  త్వరలో ‘మోహన్‌బాబు యూనివర్సిటీ’

Mbu

Updated On : January 13, 2022 / 6:41 PM IST

Mohan Babu :   హీరోగా, విలన్ గా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు పరిశ్రమలో ఉంటూ ఎన్నో మంచి సినిమాలని అందించిన సీనియర్ నటుడు మోహన్ బాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాక విద్యారంగంలో కూడా రాణిస్తున్నారు. 1993లో తిరుపతిలో శ్రీ విద్యానికేతన్‌ను అనే విద్యాసంస్థని స్థాపించారు. ఆ తర్వాత్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యావంతుల్ని ఆయన విద్యాసంస్థల నుంచి తీర్చిదిద్దుతున్నారు.

Talasani Srinivas Yadav : తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

తాజాగా మరో కీలక విషయం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోహన్ బాబు. త్వరలో “మోహన్ బాబు యూనివర్సిటీ”ని ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ”శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’’ అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.