Gang Leader : ‘మోహన కృష్ణ గ్యాంగ్ లీడర్’ రివ్యూ.. రైతుల కోసం నిలబడిన గ్యాంగ్ లీడర్..

ఖాళీగా తిరిగే ఒక యువకుడు రైతుల గిట్టుబాటు ధర పోరాటంలో పాల్గొని ఏ రేంజ్ లో ఫైట్ చేశాడు అనేదే ఈ సినిమా కథ.

Gang Leader : ‘మోహన కృష్ణ గ్యాంగ్ లీడర్’ రివ్యూ.. రైతుల కోసం నిలబడిన గ్యాంగ్ లీడర్..

Mohan Krishna Gang Leader movie review telugu

Updated On : July 7, 2023 / 8:46 PM IST

Gang Leader : జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్”. నేడు జులై 7 న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో సుమన్ ముఖ్య పాత్ర చేశారు.

Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాబో మూవీ సోషల్ ఫాంటసీనా..? మహాభారతంలోని కథతో రెండు పార్ట్‌లుగా..!

కథ విషయానికొస్తే ఒక ఊరిలో పెద్ద అయిన సుమన్, అతని కొడుకు(హీరో) మంచితనానికి మారుపేరు. ఊర్లో ఎవరికీ ఏం అవసరం వచ్చినా మేమున్నాం అంటూ ముందుకొస్తారు. నాన్నకి సపోర్ట్ గా ఉంటూ ఖాళీగా తిరిగే హీరోకి ఊర్లో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో తన తండ్రితో కలిసి రైతులకోసం గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తాడు. అదే సమయంలో హీరో ఫ్రెండ్స్ కోసం విలన్ దగ్గర తన ఆస్తి పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. వాళ్ళు తిరిగి కట్టకపోవడంతో హీరో ఏం చేస్తాడు? రైతుల కోసం హీరో ఏం చేశాడు? ఫ్రెండ్స్ చేసిన మోసాన్ని హీరో ఎలా తీసుకుంటాడు? విలన్స్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు అనేది కథాంశం.

Bro First Single My Dear Markandeya : రెడీగా ఉండండి.. బ్రో నుంచి ఫ‌స్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్‌..

సినిమా మొదట్లో హీరోయిన్స్ తో వచ్చే సన్నివేశాలు కొంచెం బోరింగ్ గా అనిపించినా తర్వాత కథలోకి వెళ్ళాక ఆసక్తిగా సాగుతుంది. రైతుల కోసం సాంగ్, రైతుల కష్టాలు చూపించడం ప్రేక్షకులని ఆలోచించేలా చేస్తాయి. హీరో సినిమాలో చిరంజీవి ఫ్యాన్ లా కనిపించడం సినిమాకు ప్లస్ అవుతుంది. మొదటి సాంగ్ కూడా చిరంజీవి గురించే ఉండటం మరింత ప్లస్ అవుతుంది సినిమాకు. హీరోయిన్ తో బీచ్ సాంగ్ కూడా బాగుంటుంది. షూటింగ్ పల్లెటూళ్ళో ఎక్కువగా తీయడంతో లొకేషన్స్ అన్ని ఆహ్లాదకరంగా చూడటానికి బాగున్నాయి అనిపిస్తుంది. సుమన్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా రైతుల కోసం, ఊరికోసం నిలబడే ఓ యువకుడి కథగా ఈ సినిమాని చూడొచ్చు.