Drishyam 3: దృశ్యం 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. సమ్మర్ లో మరింత సస్పెన్స్ తో.. రాంబాబు వచ్చేది అప్పుడేనా?

మలయాళ సూపర్ హిట్ దృశ్యం 3(Drishyam 3) మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.

Drishyam 3: దృశ్యం 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. సమ్మర్ లో మరింత సస్పెన్స్ తో.. రాంబాబు వచ్చేది అప్పుడేనా?

mohan lal and jeethu joseph drishyam 3 movie releasing in april

Updated On : January 15, 2026 / 6:49 PM IST
  • దృశ్యం 3 విడుదలై అధికారిక ప్రకటన
  • ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకి
  • తెలుగు దృశ్యం 3 దసరాకి వచ్చే అవకాశం

Drishyam 3: మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం మూవీ గురించి కొత్త పరిచయం అవసరం లేదు. దర్శకుడు జీతూ జోసఫ్ తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. తన ఫ్యామిలీని కాపాడుకోవడం ఒక సాధారణ తండ్రి ఎంతటి పోరాటం చేశాడో అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు జీతూ జోసఫ్. ఇక సినిమాలో వచ్చే ట్విస్టులకి ఆడియన్స్ మైండ్ బెండ్ అవడం ఖాయం. అంతలా స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు దర్శకుడు.

అదే సినిమాను, అదే టైటిల్ లో తెలుగులో కూడా చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రాంబాబు చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఇప్పటికి టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 కూడా వచ్చింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. దృశ్యం 2 క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకు ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Anchor Lasya: లాస్య పిల్లలకు భోగిపళ్ల వేడుక.. ఫ్యామిలీతో క్యూట్ మూమెంట్స్.. ఫొటోలు

ఇప్పుడు దానికి కొనసాగింపుగా దృశ్యం 3(Drishyam 3)ని తెరకెక్కిస్తున్నాడు జీతూ జోసఫ్. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక దృశ్యం, దృశ్యం 2కి మించిన ట్విస్టులు ఈ సినిమాలో ఉండనున్నాయని దర్శకుడు ఇప్పటికే చెప్పాడు. దీంతో ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన అప్డేట్ తో హ్యాపీ ఫీలవుతున్నారు.

అయితే, తెలుగులో వెంకటేష్ కూడా దృశ్యం 3 సినిమా చేయనున్నాడు. కానీ, ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. కానీ, త్వరలో మొదలుపెట్టి దసరాకి విడుదల చేస్తారనే టాక్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. కాబట్టి, ఎలాంటి సందేహం లేకుండా దృశ్యం 3 కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ దృశ్యం 3 రెగ్యులర్ షూటింగ్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.

mohan lal and jeethu joseph drishyam 3 movie releasing in april (1)

mohan lal and jeethu joseph drishyam 3 movie releasing in april (1)