Mohan Lal : మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్.. మరో భారీ తెలుగు పాన్ ఇండియా సినిమాలో..

ఏడేళ్ళ తర్వాత మోహన్ లాల్ ఇప్పుడు మళ్ళీ ఓ క్రేజీ తెలుగు అండ్ మలయాళ బైలింగ్విల్ మూవీతో రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అవుతుంది.

Mohan Lal : మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్.. మరో భారీ తెలుగు పాన్ ఇండియా సినిమాలో..

Mohan Lal working with another telugu film Vrushabha

Updated On : April 14, 2023 / 2:13 PM IST

Mohan Lal :  మలయాళం(Malayalam) స్టార్ హీరో మోహన్ లాల్ 62 ఏళ్ళ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘మరక్కార్’ తర్వాత నటించబోతున్న మరో పాన్ ఇండియా(Pan India) మూవీ ‘వృషభ’(Vrushabha). ఈ సినిమా తెలుగు, మలయాళ బైలింగ్విల్ గా తెరకెక్కబోతుండటం విశేషం. మనమంతా(Manamantha), జనతాగ్యారేజ్(Janatha Garage) సినిమాల తర్వాత మోహన్ లాల్ మళ్ళీ డైరెక్ట్ తెలుగు మూవీలో నటించ లేదు.

ఏడేళ్ళ తర్వాత మోహన్ లాల్ ఇప్పుడు మళ్ళీ ఓ క్రేజీ తెలుగు అండ్ మలయాళ బైలింగ్విల్ మూవీతో రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అవుతుంది. సినిమా పేరు వృషభ. దీనికి డైరెక్టర్ నందకిషోర్. తెలుగు రచయిత జనార్ధన మహర్షి ఈ సినిమాకి కథ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా కథ తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉంటుంది. తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనుండగా, కొడుకు పాత్రలో టాలీవుడ్ లోని ఓ యువ హీరోని తీసుకోవాలనుకుంటున్నారు.

ఏవీయమ్ స్టూడియోస్ బ్యానర్ పై అభిషేక్ వ్యాస్, ప్రవీణ్ సింగ్, విశాల్ గురుమణి, జుహీ పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి విశేషాల్ని తెలుపుతూ ఈ మూవీ క్రూతో మోహన్ లాల్ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రీ కొడుకుల అనుబంధంతో హైయాక్టిన్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Tollywood : జేజమ్మ, అతిలోక సుందరి పాత్రలకు ఫస్ట్ ఛాయస్ ఆ హీరోయిన్ అంటా.. తెలుసా?

ప్రజెంట్ మోహన్ లాల్ తన ఓన్ డైరెక్షన్ లో ‘బరోజ్’ మూవీ తెర కెక్కిస్తుండగా దాంతో పాటు జీతు జోసెఫ్ డైరెక్షన్ లో ‘రామ్’, ప్రియదర్శన్ డైరెక్షన్ లో ‘ఓలవుమ్ తీరవుమ్’ అనే ఆంథాలజీ మూవీ, లిజో జోస్ పెళ్ళిశ్శేరి డైరెక్షన్ లో ‘మలైకోట్టై వాలిబన్’ అనే సినిమా. పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ‘లూసిఫర్’ ప్రీక్వెల్ ‘ఎంపురాన్’ సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ‘వృషభ’ పాన్ ఇండియా మూవీ కూడా చేరింది.