12th Man: మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో విడుదల ఎప్పుడంటే?
ఇమేజ్ బంధనాలకు దూరంగా కథను ఎంచుకున్న మోహన్ లాల్ కు దృశ్యం సినిమానే భారీ ఇమేజ్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

12th Man
12Th Man: ఇమేజ్ బంధనాలకు దూరంగా కథను ఎంచుకున్న మోహన్ లాల్ కు దృశ్యం సినిమానే భారీ ఇమేజ్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఆ సినిమాలో మోహన్ లాల్ సాధారణ తండ్రిగా అవలీలగా నటించేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా దేశం మొత్తం అన్ని బాషలలో రీమేక్ గా మారడం.. దానికి సీక్వెల్ రావడం.. అది కూడా అంతే హిట్టు.. దృశ్యం 2 కూడా మళ్ళీ అన్ని బాషలలో రీమేక్.. ఇలా ఇదో ప్రాంచైజీగా మారిపోయింది.
Mohanlal : వైరల్ అవుతున్న మోహన్ లాల్ వీడియో.. కామెంట్ చేసిన పృథ్వీరాజ్
కాగా.. ఇప్పుడు అదే జీతూ జోసెఫ్-మోహన్ లాల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తుంది. అదే 12Th మాన్. ఈ సినిమా మొదలైన దగ్గర నుండే భారీ అంచనాలు నెలకోనగా మోహన్ లాల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది.
Hridayam: మలయాళంలో బ్లాక్ బస్టర్.. కరణ్ జోహార్‌కు రీమేక్ హక్కులు!
నిజానికి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో విడుదల చేయడంపై చాలా కాలంగా మోహన్ లాల్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. దేశం మొత్తం సక్సెస్ సినిమాలు ఇచ్చిన కాంబినేషన్ లో వచ్చే సినిమాను సింపుల్ గా ఓటీటీలో తీసుకురావడం ఏంటని రచ్చ చేస్తూ వచ్చారు. కానీ మేకర్స్ మాత్రం ఆ వ్యతిరేకతను పట్టించుకోకుండా ఫైనల్ గా సినిమాను మే 20 నుంచి ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు..? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి..? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.