Mokshagna : భగవంత్ కేసరి సెట్స్ లో మోక్షజ్ఞ.. శ్రీలీలతో ముచ్చట్లు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Mokshagna entry in Bhagavanth Kesari Movie Shooting sets discussions with Sreeleela Photos goes viral

Mokshagna :  అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) న‌టిస్తోండ‌గా శ్రీలీల(Sreeleela) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. థ‌మన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

భగవంత్ కేసరి సినిమాని అక్టోబర్ లో దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Vijay Devarakonda : అర్ధరాత్రి సమంతకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. మిస్ యూ అంటూ పాట పాడి..

సెట్స్ లో హీరోయిన్ శ్రీలీలతో కాసేపు ముచ్చటించాడు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా మాట్లాడాడు. అనంతరం కాసేపు షూటింగ్ ని చూశాడు మోక్షజ్ఞ. దీంతో భగవంత్ కేసరి సెట్స్ లో మోక్షజ్ఞ ఫొటోలు వైరల్ గా మారాయి. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీలీలతో ముచ్చటిస్తున్న ఫొటోలు వైరల్ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో శ్రీలీల హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.