Squid Game-2 : మరింత భయంకరంగా స్క్విడ్ గేమ్-2 టీజర్.. ఎలా ఉందో చూసారా..

More Scary Squid Game 2 Teaser goes viral
Squid Game-2 : ఈ మధ్యకాలంలో సినీ లవర్స్ అందరూ చాలా వరకు ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడలేని వారందరూ ఇంట్లోనే ఓటీటీలల్లో చూసుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా ఓటీటీలల్లో మంచి మంచి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి. ఇక ఆడియన్స్ మాత్రం కేవలం తెలుగే కాకుండా ఇతర భాషల సిరీస్ కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Also Read : Pooja Hegde : పేరెంట్స్ తో పూజా హెగ్డే దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు చూసారా..
అయితే అలాంటి సిరీస్ లో ముందు వరుసలో ఉంటుంది స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ 2021లో విడుదలైంది. అప్పటినుండి ఈ సిరీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. కొరియన్ భాషలో వచ్చిన ఈ సిరీస్ కి అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. దీంతో ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ గా స్క్విడ్ గేమ్ 2 ప్రకటించారు. డిసెంబర్ 26 నుండి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ కూడా విడుదల చేశారు.
ఇక టీజర్ చూసుకుంటే.. పార్ట్ వన్ లో ఉన్నట్టుగానే ఒక డాల్ గేమ్ తో టీజర్ స్టార్ట్ చేశారు. రెడ్ లైట్, గ్రీన్ లైట్ తో చాలా భయంకరంగా, ఏం జరుగుతుందో అని ఇంట్రెస్టింగ్ గా ఉంది టీజర్. ముందు ముందు ఇంకెన్ని భయంకరమైన గేమ్స్ ఉంటాయో చూడాలి. మొదటి పార్ట్ లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి పార్ట్ 2లో ఉన్నవారన్నా తమ ప్రాణాలను కాపాడుకొని బయటికి వెళ్తారా లేదా చూడాలి.