బెంగుళూరులో బొమ్మపడింది.. లేడీస్ క్యూ కట్టారు..

Movie theatres in Bengaluru: లాక్‌డౌన్‌తో దాదాపు 8 నెలలుగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అన్నీ మూతపడ్డాయి. అయితే దశలవారీగా అన్‌లాక్ మార్గదర్శకాలను విడుదల చేస్తోన్న కేంద్రం ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బెంగుళూరులోని థియేటర్లు తెరిచారు. అయితే తొలిరోజే 50 శాతం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినట్టు మీడియాకు సమాచారమందింది. వచ్చిన వారిలో ఎక్కువశాతం మహిళలు ఉన్నారని.. త్వరలో ఆడియెన్స్ శాతం పెరిగే అవకాశముందని కర్ణాటక థియేటర్ల యాజమాన సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోలేదు. కానీ విశాఖపట్నంలో ఓ మల్టీప్లెక్స్ తెరిచారని, ప్రేక్షకుల స్పందన అంతంతమాత్రంగా ఉందని తెలుస్తోంది.