నయన్‌ని ఆటపట్టిస్తున్న కార్తికేయన్
మిస్టర్ లోకల్ టీజర్ రిలీజ్..

మిస్టర్ లోకల్ టీజర్ రిలీజ్..
తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, రాజేష్ ఎమ్. డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, మిస్టర్ లోకల్… శివ కార్తికేయన్, నయన్ కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శివ కార్తికేయన్‌కి హీరోగా ఇది 13వ సినిమా. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 17 న, శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మిస్టర్ లోకల్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నా పేరు మనోహర్, అందరూ మిస్టర్ లోకల్ అని పిలుస్తారు.. అంటూ శివ కార్తికేయన్ తన గురించి తను ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడంతో స్టార్ట్ అయిన మిస్టర్ లోకల్ టీజర్, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
నేనెవరో తెలుసా, కీర్తనా వాసుదేవన్, కీర్తనా ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ ని అంటూ నయనతార, హీరోకి తన గురించి తాను గర్వంగా చెప్పుకోవడం, హీరో ఆమెని టీజ్ చెయ్యడం… ఇలా.. సరాదాగా, ఫన్నీగా సాగిపోయింది మిస్టర్ లోకల్ టీజర్.. త్వరలో ఆడియో రిలీజ్ చెయ్యబోతున్నారు. మేడే స్పెషల్‌గా, మే 1 న మిస్టర్ లోకల్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ : హిప్ హాప్, కెమెరా : దినేష్ కృష్ణన్ బి. ఎడిటింగ్ : వివేక్ హర్షన్, స్టంట్స్ : అన్బరివు.
వాచ్ మిస్టర్ లోకల్ టీజర్…