మే 17న మిస్టర్ లోకల్
తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న Mr.లోకల్ మే 17న విడుదల కానుంది..

తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న Mr.లోకల్ మే 17న విడుదల కానుంది..
తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, రాజేష్ ఎమ్. డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సినిమా.. Mr.లోకల్.. హీరోగా శివ కార్తికేయన్‌కిది 13వ సినిమా. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, ఉదయనిధి స్టాలిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన Mr.లోకల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. శివ కార్తికేయన్, మనోహర్ అనే మధ్యతరగతి యువకుడిగానూ, నయనతార, కీర్తన వాసుదేవన్ అనే కార్పొరేట్ కంపెనీకి యజమానిగానూ కనిపించనున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మే 17న Mr.లోకల్ విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. రాధికా శరత్ కుమార్, యోగిబాబు, సతీష్, తంబి రామయ్య, ఆర్‌జే బాలాజీ, రోబో శంకర్ మనోబాలా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : దినేష్ కృష్ణన్, ఆర్థర్ ఎ.విల్సన్ (ఒక సాంగ్), ఎడిటింగ్ : వివేక్ హర్షన్, సంగీతం : హిప్ హాప్ తమిఝ..
వాచ్, Mr.లోకల్ టీజర్..