Mrunal Thakur : ఆ క్రికెటర్‌‌‌ను పిచ్చిగా ప్రేమించా.. మృణాల్ ఠాకూర్ సీక్రెట్ లవ్!

సినీనటి మృణాల్ ఠాకూర్ తన లవ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక క్రికెటర్‌ను పిచ్చిగా ప్రేమించానంటూ రివీల్ చేసింది. అతడే ఫేవరెట్ క్రికెటర్.. క్రికెట్ పట్ల ఇష్టమే అతడిపై ప్రేమ కలిగిందంట.

Mrunal Thakur Reveals Her Being In ‘love’ With A Certain Cricketer

Mrunal Thakur love with a certain cricketer : సినీనటి మృణాల్ ఠాకూర్ తన లవ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక క్రికెటర్‌ను పిచ్చిగా ప్రేమించానంటూ రివీల్ చేసింది. అతడే తన ఫేవరెట్ క్రికెటర్ అని.. తన సోదరుడి ప్రేరణతో క్రికెట్ పై ఇష్టం కలిగిందంటూ అప్పటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసింది. మృణాల్ చిన్నప్పుటి నుంచే పాఠశాలలో క్రీడల పట్ల ఇష్టం ఉండేది. బాస్కెట్‌బాల్ కూడా ఆడేది. కొన్ని జోనల్ మ్యాచ్‌లలో కూడా పాల్గొంది. ఫుట్‌బాల్ ఆమెకు ఇష్టమైన క్రీడ. క్రీడల్లో తాను ఎప్పుడూ చురుకుగా ఉంటానని మృణాల్ చెప్పుకొచ్చింది.

క్రికెట్ పట్ల తనకెంతో పిచ్చి అని.. ఒక క్రికెటర్‌ను తాను పిచ్చిగా ప్రేమించినట్టు తెలిపింది. ఇంతకీ అతడు ఎవరో కాదు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నేను విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించాను అంటూ రివీల్ చేసింది. కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్ అంటోంది. తన సోదరుడి కారణంగా క్రికెట్‌పై ఇష్టం ఏర్పడిందని తెలిపింది.
Rana Daggubati : రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కున్న రానా

దాదాపు ఐదేళ్ల క్రితం స్టేడియంలో ఒక మ్యాచ్‌ను లైవ్ చూసినప్పటినుంచి తనకు క్రికెట్ పట్ల ఇష్టం ఏర్పడిందని తెలిపింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. నీలిరంగు జెర్సీ ధరించిన టీమ్ ఇండియాను చూడగానే ఎంతో ఉత్సాహంగా అనిపించిందని మృణాల్ గుర్తుచేసుకుంది.

కట్ చేస్తే.. తాను జెర్సీ లాంటి క్రికెట్ ఆధారిత సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని, అదొక యాదృచ్చికమని తెలిపింది. విరాట్ కోహ్లీ అభిమానులు ప్రతిచోటా ఉన్నారు. ఆ అభిమానుల్లో మృణాల్ తాను ఒకరు అంటోంది. మృణాల్ తదుపరి జెర్సీలో కనిపించనుంది. షాహిద్ కపూర్‌తో కలిసి కనిపించనుంది. ఇషాన్ ఖట్టర్‌తో పిప్పా అనే మూవీలో కూడా మృణాల్ నటిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ నటించిన తృథమ్ రీమేక్‌లో మృణాల్ ప్రధాన పాత్ర పోషించింది.

డ్రగ్స్ కేసు… రానా, కెల్విన్‌ల విచారణ