Mrunal Thakur : ప్రతి ఇంట్లో శృంగారం గురించి మాట్లాడుకోవాలి.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ కామెంట్స్
తాజాగా మృణాల్ ఠాకూర్ లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Mrunal Thakur Sensational comments in Lust Stories 2 Promotions
Lust Stories 2 : సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులోనే కాక దేశమంతా పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగల అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్స్ తో మరింత పాపులర్ అయి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్.
తాజాగా మృణాల్ ఠాకూర్ లస్ట్ స్టోరీస్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 2018లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన బోల్డ్ కంటెంట్ లస్ట్ స్టోరీస్ సినిమా బాగా పాపులర్ అయి చర్చల్లో నిలిచింది. తాజాగా ఈ సినిమాకి పార్ట్ 2 రాగా ఇందులో మృణాల్ నటించింది. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలో మృణాల్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. లస్ట్ స్టోరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో మాట్లాడుకోవాలి అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంట్లో యూత్ లో ఉన్నవాళ్లు ఉంటే వాళ్లకి దీని గురించి చెప్పాలి. వాళ్లకి ఈ టాపిక్స్ గురించి చెప్పడానికి ఒకరు ఉండాలి. ఇలాంటి టాపిక్స్ ని నిజాయితీగా పిల్లలకు చెప్పినప్పుడే వారు బయట తప్పుడు సమాచారం తెలుసుకోకుండా ఉంటారు అని తెలిపింది. దీంతో మృణాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.