Adipurush : ఆదిపురుష్ పై ముఖేష్ ఖన్నా ఆగ్రహం.. రామాయణంకి ఇంతకంటే పెద్ద అగౌరవం లేదు..

ఆదిపురుష్ సినిమా పై ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంకి ఇంతకంటే పెద్ద అగౌరవం లేదు..

Adipurush : ఆదిపురుష్ పై ముఖేష్ ఖన్నా ఆగ్రహం.. రామాయణంకి ఇంతకంటే పెద్ద అగౌరవం లేదు..

Mukesh Khanna serious comments on Prabhas Om Raut Adipurush

Updated On : June 19, 2023 / 4:24 PM IST

Prabhas Adipurush : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రామాయణ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చి వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలోని పాత్రల వేషధారణ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా (Mukesh Khanna) కూడా స్పందించారు. గతంలో ఆదిపురుష్ టీజర్ సమయంలో కూడా ఆయన మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Adipurush : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌లో పఠాన్ రికార్డుని బ్రేక్ చేసిన ఆదిపురుష్.. ప్రభాస్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్!

“రామాయణంకి ఆదిపురుష్ కంటే పెద్ద అగౌరవం లేదు. దర్శకుడు ఓం రౌత్ కి ‘రామాయణం’ గురించి అసలు అవగాహన లేదు. ఇక రచయితా మనోజ్ ముంతాషిర్ శుక్లా.. గొప్ప బుద్ధిజీవి అనుకుంటూ త్రేతాయుగ రామాయణాన్ని కలియుగంగా మార్చేలా డైలాగ్స్ రాశాడు. ఆ అర్ధంలేని డైలాగ్ మరియు స్క్రీన్‌ప్లే అందరికి ఇబ్బంది కలిగించింది. ఇప్పటి వరకు రాసిన రామాయణాలకు ఈ చిత్రానికి అసలు సంబంధం లేదు. టీజర్ తరువాత తప్పులు సరిదిద్దుకొని వెనక్కి వెళ్లి.. కొత్త ట్రైలర్ తో వెనక్కి వచ్చినప్పుడు కూడా నాకు తప్పులు కనిపించాయి. కానీ ఇక ఆ సినిమా భవిష్యత్తును ప్రజలే నిర్ణయించుకోవాలని అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు చూసిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.

Rakesh Master : రాకేశ్ మాస్టర్ పార్థివదేహానికి శేఖర్ మాస్టర్ నివాళులు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్!

అలాగే రామాయణంతో రౌత్ చేసిన పనిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని కూడా పేర్కొన్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్‌ తో ఓం రౌత్ ప్రభావితం అయ్యి మన రామాయణాన్ని అభ్యంతరకరంగా తెరకెక్కించాడని చెప్పుకొచ్చారు. మేకర్స్ సినిమా స్వేచ్ఛను తీసుకోవాలనుకున్నప్పుడు కల్పిత కథతో వచ్చే ప్రయత్నం చేయాలని, అంతేగాని ధర్మాలకు సంబంధించిన కథలతో ఇలా చేయడం ప్రమాదకరమైన జోక్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తే కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించారు.