God Father : 31 ఏళ్ళ తర్వాత మెగాస్టార్‌తో కలిసి నటిస్తున్న మురళీమోహన్.. గాడ్ ఫాదర్ కోసం స్పెషల్ గెటప్..

మురళీ మోహన్ మాట్లాడుతూ.. ''కొన్ని రోజుల క్రితం చిరంజీవి నాకు ఫోన్ చేసి గాడ్‌ ఫాదర్‌ అనే సినిమా తీస్తున్నాం. మా దర్శకుడు మోహన్‌ రాజా మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కి అనుకుంటున్నారు. మీ ఫొటోలు పంపిస్తారా.............

God Father : 31 ఏళ్ళ తర్వాత మెగాస్టార్‌తో కలిసి నటిస్తున్న మురళీమోహన్.. గాడ్ ఫాదర్ కోసం స్పెషల్ గెటప్..

Murali Mohan

Updated On : July 8, 2022 / 9:38 AM IST

Muralimohan :  66 ఏళ్ళ ఏజ్ లోనూ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి యువ హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. దాదాపు అరడజను సినిమాలు చిరంజీవి ఓకే చేసి ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. త్వరలో దసరాకి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు చిరంజీవి. మోహన రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మురళి మోహన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

31 ఏళ్ళ తర్వాత మురళీ మోహన్ గాడ్ ఫాదర్ సినిమాలో మళ్ళీ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. గతంలో ‘మనవూరి పాండవులు’, ‘త్రినేత్రుడు’, ‘యుద్ధభూమి’, ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి పలు సినిమాల్లో మురళీ మోహన్ చిరంజీవి కాంబినేషన్ లో కలిసి నటించారు. తాజాగా మురళీ మోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి తెలిపారు.

Krishnavamsi : రంగమార్తాండలో.. చిరంజీవి వాయిస్ మాత్రమే కాదు.. యాక్టింగ్ కూడానా??

మురళీ మోహన్ మాట్లాడుతూ.. ”కొన్ని రోజుల క్రితం చిరంజీవి నాకు ఫోన్ చేసి గాడ్‌ ఫాదర్‌ అనే సినిమా తీస్తున్నాం. మా దర్శకుడు మోహన్‌ రాజా మిమ్మల్ని ఒక క్యారెక్టర్ కి అనుకుంటున్నారు. మీ ఫొటోలు పంపిస్తారా? మీ నాన్నగారు చనిపోయినపుడు కొన్నాళ్లు మీరు వైట్‌ హెయిర్‌తో ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలుంటే పంపించండి అని అడిగారు. నేను వెంటనే ఫోటోలు పంపించాను. దర్శకుడు చూడగానే ఆ గెటప్ లోనే సినిమాలో కావాలి అన్నాడట. దీంతో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కోసం తెల్ల జుట్టుతోపాటు గడ్డాన్ని పెంచాను. నా పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు